Share News

MLC Kavitha: శాసనమండలి చైర్మన్ గుత్తాకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు..

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:37 PM

బీసీ అయినంత మాత్రాన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను బయట తిరగనివ్వనని అనటానికి మల్లన్న ఎవరంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavitha: శాసనమండలి చైర్మన్ గుత్తాకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు..
MLC Kavitha

హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ ఇంటికెళ్లి మరీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని తీన్మార్ మల్లన్నను ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అంటూ ప్రశ్నించారు.

ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డను ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.. మాండలికం అంటే ఎట్లా? అని కవిత ప్రశ్నించారు. ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండన్న కవిత.. తీన్మార్‌ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. వెంటనే అతన్ని అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు.


మల్లన్నకు కవిత వార్నింగ్

బీసీ అయినంత మాత్రాన.. మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని కవిత అన్నారు. 'నన్ను బయట తిరగనివ్వను అనటానికి మల్లన్న ఎవరు?. ఈరోజు ఏం జరిగిందో చూశారు కదా.. పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. వెంటనే తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.

ముఖ్యమంత్రి ఇంటి బిడ్డలకు ఒక న్యాయం. ఇతరులకు మరొక న్యాయమా? మల్లన్నను అరెస్ట్ చేయకుంటే.. మల్లన్న వెనుక ముఖ్యమంత్రి ఉన్నారుకోవాల్సి ఉంటుంది. మల్లన్నపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. శాసనమండలి చైర్మన్ తన విచక్షణ ఉపయోగించి మల్లన్నను ఎమ్మెల్సీగా డిస్ క్వాలిఫై చేయాలి. ఆడబిడ్డలు అనుకుంటే మల్లన్న ఇంట్లో నుంచి బయటకురారు. ఆవేశం వచ్చి జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారు. అంతమాత్రాన కాల్పులు జరుపుతారా?' అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.

రాజకీయాలంటే.. మేకప్ వేసుకుని చేసే డ్రామా కాదని మల్లన్న గుర్తుంచుకోవాలని కవిత ఆక్షేపించారు. 'నేను బీసీ ఉద్యమం చేస్తుంటే మల్లన్న తట్టుకోలేకపోతున్నారా? ఏదైనా ఉంటే.. ఇష్యూ మీద మాట్లాడాలి. ఆడబడ్డలు రాజకీయాల్లోకి రావొద్దా?. నేను ఏనాడు మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీసీల కోసం ఆయన మాదిరే నేను పోరాటం చేస్తున్నా. ఘటనపై విచారణ జరపాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నా' అని కవిత స్పష్టం చేశారు.


కవితకు తీన్మార్ మల్లన్న కౌంటర్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ అనంతరం తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. 'ఎథిక్స్ కమిటీ సిఫార్స్ చేయాలన్న మీరు ఏ ఎథిక్స్ తో మా మీద దాడికి పంపారు. నా మీద ఎక్కడైనా ఫిర్యాదు చేయండి. మా మీద దాడి చేసి శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయడం ఏంది?. శాసన మండలి చైర్మన్ దాడి చేయమని చెప్పారా?. బీసీల మీద దాడి చేయమని కవితనే ప్రోత్సహించారు. ఈ ఘటన మీద సీఎం స్పందించాలంటున్న కవిత.. ఆమెనే నా కార్యాలయం మీద దాడి చేయమని చెప్పారా?. ఆమె వెనక్కి తగ్గడం కాదు, రేపటి నుంచి బీసీల తడాఖా ఏంటో చూపిస్తాం' అంటూ కవితపై తీన్మార్ మల్లన్న ఎదురుదాడికి దిగారు.

Untitled.jpgఇలా ఉండగా, తాను ఎక్కడా అగౌరవంగా మాట్లాడలేదని తీన్మార్‌ మల్లన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. '40 మంది నా కార్యాలయంపై దాడి చేశారు. నాకు, నా సిబ్బందికి గాయాలు అయ్యాయి. మొన్న మహాటీవీ, ఇవాళ క్యూ న్యూస్‌, రేపు మరోటి. మాపై దాడులు చేయొచ్చేమో కానీ ఆత్మాభిమానాన్ని చంపలేరు. ఇది నా మీద దాడి కాదు యావత్తు బీసీలపై దాడి. నా భాషలో తెలంగాణ మాండలీకం ఉంది. రేపటి నుంచి తెలంగాణలో కవితను తిరగనియ్యం.' అని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.

కాగా, హైదరాబాద్ మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి సంబంధించిన (MLC Teenmar Mallanna) క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు దాడికి దిగారు. దాడి సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ మల్లన్న ఉన్నారు. మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. జాగృతి సభ్యులు బయటకి వెళ్లకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్‌మెన్ హెచ్చరించాడు. గన్‌మెన్ హెచ్చరించినా కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్లకపోవడంతో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు.


ఈ వార్తలు కూడా చదవండి

వికసిత్‌ తెలంగాణ బీజేపీకే సాధ్యం

రాజకీయ న్యాయానికి భరోసా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2025 | 04:57 PM