HCA: HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:34 PM
HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు..

హైదరాబాద్, జులై, 25: HCA(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్ ఇచ్చింది. మరోవైపు, జగన్మోహన్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని వేసిన CID పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్మోహన్‌రావు, సునీల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని కోర్టు పేర్కొంది.
ఇలా ఉండగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ కు సంబంధించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో రూ.4 కోట్లు కాజేసినట్టు తెలుస్తోంది. HCA ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు అండ్ కో, గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించింది. ప్రతీ క్యాంప్‌లో 100 మందికి చొప్పున 2,500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో HCA కార్యకలాపాల పర్యవేక్షణకు జస్టిస్ నవీన్‌రావు హైకోర్టు నియమించింది.
ఇక, ఈ కేసులో మరో తాజా పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ (శుక్రవారం) మహారాష్ట్రలోని పుణెలో దేవరాజును అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకువచ్చి.. మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై కేసు నమోదైన.. దాదాపు 17 రోజుల అనంతరం సీఐడీ పోలీసులకు దేవరాజు చిక్కారు. ఈ 17 రోజుల్లో దాదాపు 7 రాష్ట్రాల్లో దేవరాజు పర్యటించినట్లు ఈ సందర్భంగా పోలీసులు గుర్తించారు. కాగా, దేవరాజును గాలించేందుకు 6 ప్రత్యేక బృందాలను సీఐడీ అధికారులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కుంభకోణం వెలుగులోకి రాగానే.. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ సమాచారంతో సీఐడీ నుంచి దేవరాజు తప్పించుకున్న విషయం విదితమే. దీంతో ఆయనను పట్టుకునేందుకు సీఐడీ బృందాలు.. ఈ 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగాయి. చివరకు పుణెలో దేవరాజును అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ అధికారులు దాదాపు 36 గంటల పాటు నిర్విరామంగా పని చేసి.. పుణెలో దేవరాజును అరెస్ట్ చేశారు. సీఐడీ నుంచి దేవరాజు తప్పించుకున్న తర్వాత.. హైదరాబాద్, భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పుణె, ఊటీ, యానాం తదితర ప్రదేశాల్లో దేవరాజు పర్యటించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో సీఐడీ అధికారులు దేవరాజును పట్టుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కుంభకోణంలో దేవరాజు ఏ2గా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News