Srushti Fertility: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 08:36 PM
సృష్టి ఫెర్టిలిటీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ పేరుతో పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారు.

హైదరాబాద్, జులై 31: సృష్టి ఫెర్టిలిటీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ పేరుతో పలువురు దంపతులను మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీస్ విచారణలో తన తప్పుల్ని డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. రాజస్థాన్ దంపతులనూ సరోగసీ విషయంలో నమ్రత మోసం చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు.
'రాజస్థాన్ దంపతులు డీఎన్‌ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని నమ్రత తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి నచ్చచెప్పి చూశారు. అయితే, వాళ్లు వినకపోవడంతో తన కుమారుడితో రాజస్థాన్ దంపతుల్ని బెదిరించారని' పోలీసులు తెలిపారు.
సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేసిందని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఏపీలో కొంత మంది ఏఎన్‌ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని, గాంధీ ఆస్పత్రి అనస్థీషియన్ డాక్టర్ సదానందం వీరికి పూర్తిస్థాయిలో సహకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, హైదరాబాద్ లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ లో మోసాలకు సంబంధించిన కేసులో సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని.. తదితర ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై కేసు నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం
For More AndhraPradesh News And Telugu News