Jubilee Hills: కత్తులతో ఇంటి యజమానిని భయపెట్టాలని చూశాడు.. చివరకు
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:59 AM
యజమాని ఇంట్లోనే దోపిడీ చేసేందుకు యత్నించిన కాపలాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్, నవంబర్ 25: ఇంటి యజమానిపైనే దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మిన వ్యక్తిగా ఉంటూనే యజమానికి హాని తలపెట్టాలని భావించాడు ఆ వ్యక్తి. అనుకున్నదే తడువుగా పథకం రచించాడు. అతనికి తోడుగా మరో ఐదుగురిని వెంట తెచ్చుకున్నాడు. ఏకంగా కత్తులతో బెదిరించి, భయపెట్టి మరీ ఇంట్లో దోపిడీ చేయాలని యత్నించాడు. చివరకు అతడి పాపం పండి ఊచలులెక్కబెడుతున్నాడు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో శనివారం (ఈనెల 22) అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అజయ్ అగర్వాల్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నాడు. ఆ ఇంటికి రాధాచంద్ చాలా కాలంగా కాపలాదారుడిగా ఉన్నాడు. అజయ్ అతడిని ఎంతగానో నమ్మాడు. కానీ యజమాని ఇంటినే దోపిడీ చేయాలని ప్రయత్నించాడు రాధాచంద్. ఇంట్లోని బంగారం, నగదును దోచుకెళ్లాలని పక్కా ప్లాన్ వేశాడు. ఇందుకోసం మరో ఐదుగురితో కలిసి పథకం వేశాడు. ఈ క్రమంలో గత శనివారం అర్ధరాత్రి ఐదుగురితో కలిసి రాధాచంద్.. అజయ్ ఇంట్లోకి ప్రవేశించాడు.
తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఇంటి యజమానిపై దాడికి యత్నించాడు. డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి కత్తులతో దాడి చేశాడు. అంతేకాకుండా అజయ్ కుటుంబ సభ్యులను కూడా నిందితులు భయపెట్టాడు. అర్ధరాత్రి ఇంట్లో నానా హంగామా చేశారు. చివరకు కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. రాధాచంద్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి కాపలాదారే ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఆ లింక్‌లు తెరిచారో... ఇక మీ పని అయిపోయినట్లే...
Read Latest Telangana News And Telugu News