Share News

Jubilee Hills By Poll: ఊపందుకోనున్న నామినేషన్లు.. నేడే బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్

ABN , Publish Date - Oct 15 , 2025 | 09:59 AM

సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లుండి (ఈనెల 17) నామినేషన్ వేనున్నారు.

Jubilee Hills By Poll: ఊపందుకోనున్న నామినేషన్లు.. నేడే బీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్
Jubilee Hills By Poll

హైదరాబాద్, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills By Poll) నేటి (బుధవారం) నుంచి నామినేషన్లు ఊపందుకోనున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. సునీతతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అయితే సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఎల్లుండి (ఈనెల 17) నామినేషన్ వేనున్నారు.


అటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా... ప్రచారాన్ని కూడా విస్తృతం చేశాయి. ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను కూడా దాఖలు చేయనున్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించని పరిస్థితి. నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల షురూ అయ్యాయి. మొదటి రోజు 10 మంది నామినేషన్లు వేశారు. అలాగే రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం రెండు రోజుల్లో 20 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో 6 రిజిస్టర్ పార్టీలు కాగా 14 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

కృష్ణా జలాల పునరుద్ధరణ..

జిల్లాల యాత్రకు.. కవిత శ్రీకారం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 10:12 AM