Bhatti Vikramarka On JNTU: జేఎన్‌టీయూ విద్యార్థుల ప్రతిభ దేశానికి గర్వకారణం
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:57 PM
జేఎన్‌టీయూ హైదరాబాద్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
హైదరాబాద్: జేఎన్‌టీయూ (Jawaharlal Nehru Technological University) వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదని.. ఇది దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. ఇంజనీర్లను తయారు చేసే శక్తివంతమైన దేశ ఇంజిన్ అని ప్రశంసించారు.
ISRO నుంచి Google, DRDO నుంచి Tesla వరకు JNTU విద్యార్థుల ప్రతిభ ప్రపంచానికి ఎంతో గర్వకారణమన్నారు. విద్య అనేది ఖర్చు కాదని, భవిష్యత్తును నిర్మించే పెట్టుబడని విద్యార్థులకు భట్టి విక్రమార్క సందేశం ఇచ్చారు. ఉద్యోగాలు వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగాలని సూచించారు. మొదటి 60 ఏళ్ల కంటే, వచ్చే 60 ఏళ్లు మరింత మహోన్నతంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.
ఇవి కూడా చదవండి..
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్
Read Latest Telangana News