Transgenders: నిప్పంటించుకున్న ఘటనలో మరో ట్రాన్స్‌జెండర్ మృతి
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:16 AM
హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్స్ గ్రూపుల మధ్య వివాదం ఇద్దరు మృతికి కారణమైంది. ఏదో భయపెట్టేందుకో లేదా మరోదానికో ట్రాన్స్ జెండర్స్ వంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే, శరీరానికి తీవ్ర కాలిన గాయాలు కావడంతో..
హైదరాబాద్, నవంబర్ 23: హైదరాబాద్ బోరబండలో ట్రాన్స్‌జెండర్స్ నిప్పు అంటించుకున్న ఘటనలో మరొకరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో ట్రాన్స్‌జెండర్ హీనా(22)ఇవాళ మృతి చెందింది. తెల్లవారుజామున హీనా మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.
రెండు రోజుల క్రితం ఇదే ఘటనలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ అప్సర అనే ట్రాన్స్ జెండర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓ బర్త్డే పార్టీలో రెండు ట్రాన్స్ జెండర్ గ్రూపుల మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ట్రాన్సజెండర్ గ్రూప్స్ లీడర్ మోనాలిసా వద్దకు ఈ వివాదం వెళ్లింది.

అయితే, మోనాలిసా ఓ గ్రూప్ సభ్యులను తిట్టి దాడి చేసిందని ఆరోపణలున్నాయి. దీంతో మోనాలిసాకు వ్యతిరేకంగా బోరబండ బస్ స్టాప్ వద్ద ట్రాన్స్ జెండర్స్ గ్రూప్ ధర్నా చేసింది. పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో ఆ గ్రూపు సభ్యుల్లో ఇద్దరు పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అప్సర, హీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News