Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:51 AM
Raj Tarun Parents: రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య అంగీకరించింది. పోలీసులతో జరిపిన చర్చల అనంతరం రాజ్ పేరెంట్స్‌ను ఇంట్లో ఉండనిచ్చేందుకు లావణ్య ఓకే చెప్పింది.

హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరంలోని కోకాపేటలో గల పావని విల్లాలో హీరో రాజ్‌తరుణ్(Hero Raj Tarun) ఇంటి వద్ద జరిగిన హైడ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు హీరో తల్లిదండ్రులు కోకాపేటలోని ఇంట్లోకి వెళ్లారు. ఈ వ్యవహారానికి సంబంధించి అర్ధరాత్రి సమయంలో లావణ్యతో పోలీసులు మాట్లాడారు. చివరకు వారిని ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య ఓకే చెప్పడంతో.. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను పోలీసులు ఇంట్లోకి పంపించారు. నిన్న (బుధవారం) వృద్ధాప్యంలో ఉన్న హీరో తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరితో పాటు వారి కేర్ టేకర్స్ కోకాపేటలోని రాజ్‌తరుణ్ ఇంటికి చేరుకోగా లావణ్య హైడ్రామా సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా.. సూరారంలో ఉంటున్న రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు.. అద్దె ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ కుమారుడి ఇంట్లో ఉండేందుకు కోకాపేటకు వచ్చారు. అప్పటికే ఆ ఇంట్లో ఉంటున్నారు లావణ్య. దీంతో రాజ్ పేరంట్స్ రాగానే వారిని ఇంట్లోకి రానీయకుండా లావణ్య అడ్డుకుంది. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు పది మందితో కలిసి వచ్చి తన ఇంటిపై దాడి చేశారంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కేసు కోర్టులో ఉందని, పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి రావాలని ఆమె తేల్చి చెప్పారు. అంతే కాకుండా తమను ఇంట్లో నుంచి గెంటేయడానికే రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు వచ్చారని లావణ్య ఆరోపించారు.
Viral Video: ఛీ నువ్వసలు డాక్టర్‌వేనా.. ఇంత దారుణమా..
దీంతో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటే ఉండిపోయారు. తమ కొడుకు కష్టార్జీతంతో కొన్న ఇళ్లని తమకు న్యాయం చేయాలని రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు కోరగా.. ఇంటి నిర్మాణం కోసం రాజ్‌తరుణ్‌కు కోటి రూపాయలు ఇచ్చానని లావణ్య తండ్రి చెబుతున్నాడు. కానీ అదంతా అబద్ధమని రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు తెలిపారు. తాము కోకాపేట నివాసానికి వస్తున్నట్లు రాజ్‌తరుణ్‌కు కూడా తెలియదని వారు చెబుతున్నారు. లావణ్య తమ కోడలు కాదని.. సహజీవనం చేసింది తప్ప తన కొడుకును వివాహం చేసుకోవాలని రాజ్ పేరెంట్స్ అంటున్నారు. అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. చివరకు నార్సింగీ పోలీసులు రంగప్రవేశం చేసి లావణ్యతో సంప్రదింపులు జరిపారు. లావణ్యకు నచ్చజెప్పడంతో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చేందుకు అనుమతించింది. అయితే కోకాపేట్‌లో ఉన్న విల్లా తన కొడుకుదే అని రాజ్‌తరుణ్ తల్లిద్రండులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్
Chanakya Niti: ఈ తప్పులు చేస్తే జీవితాంతం పేదరికంలో మగ్గిపోతారు..
Read Latest Telangana News And Telugu News