Uppal Stadium CID Raids: హెచ్‌సీఏ స్కామ్.. ఉప్పల్ స్టేడియంలో సీఐడీ సోదాలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:02 PM
Uppal Stadium CID Raids: హెచ్‌సీఏ అక్రమాల కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావును ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు సీఐడీ అధికారులు.

హైదరాబాద్, జులై 18: హెచ్‌సీఏ స్కామ్ కేసులో (HCA Scam Case) సీఐడీ (CID) విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉప్పల్ స్టేడియంలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఏ అక్రమాల కేసులో నిందితుల సీన్ రీకన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఏ1 నిందితుడు జగన్ మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లారు సీఐడీ అధికారులు. ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. అనంతరం ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీచక్ర క్లబ్‌కు నిందితులను తరలించనున్నారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుతోపాటు ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంటే, శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేంద్ర యాదవ్‌లతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.
హెచ్‌సీఏ అక్రమాలపై నిందితులను సీఐడీ రెండో రోజు విచారిస్తోంది. విచారణలో భాగంగా సీఐడీ కార్యాలయం నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడే ఏ1 నిందితుడితో సీన్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. హెచ్‌సీఏ కేంద్రంగా నడిచిన అక్రమాలన్నింటిపై సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగుతోంది. సీఐడీ విచారణలో ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఎన్నిక, ఐపీఎల్ టికెట్ల వివాదం, బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్‌మాల్‌పైనా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా.. జగన్ మోహన్ రావు కీలకమైన వ్యక్తి. హెచ్‌సీఏ స్కామ్‌లో జగన్ మోహన్ రావు పాత్ర కీలకమని సీఐడీ గుర్తించింది. దాదాపు రెండు సంవత్సరాల వ్యవధిలోనే బీసీసీఐ నుంచి రూ. 170కోట్లు నిధులు వచ్చాయి. ఈ నిధులకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అక్రమాలు జరిగాయని సీఐడీ గుర్తించింది.
ఇవి కూడా చదవండి..
వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం..త్వరలోనే
బావ బామ్మర్దులది పనికిమాలిన ఏడుపు.. కేటీఆర్, హరీష్‌పై జగ్గారెడ్డి ఫైర్
Read latest Telangana News And Telugu News