Share News

Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

ABN , Publish Date - May 29 , 2025 | 10:42 AM

Gaddar Film Awards: 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొంది. ప్రముఖ కవి గద్దర్ పేరుతో తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు.

Gaddar Film Awards:  గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Gaddar Film Awards

హైదరాబాద్, మే 29: ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు సినిమా అవార్డులు (Telugu Cinema Awards) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరి ఏర్పాటు అయ్యింది. ఈ క్రమంలో ఈరోజు (గురువారం) ఉదయం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Awards Committee Chairman Jayasudha) ప్రకటించారు.


దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇవ్వబోతోందని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Film Development Corporation Chairman Dil Raju) అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేశామని జయసుధ చెప్పారు. అవార్డులు తమకు బూస్ట్ ఇస్తాయని.. ప్రభుత్వం తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి , దిల్ రాజు‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 14 ఏళ్ల అనంతరం అవార్డులు ఇవ్వటం సంతోషమన్నారు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డులు వస్తున్నాయని అన్నారు. జూన్ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం జరుగుతుందన్నారు. అలాగే 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ వెల్లడించారు.


గద్దర్ అవార్డులు వీరికే

  • ఉత్తమ చిత్రం - కల్కి

  • ఉత్తమ రెండో చిత్రం - పొట్టేల్

  • ఉత్తమ మూడో చిత్రం - లక్కీభాస్కర్

  • ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2)

  • ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథకాదు)

  • ఉత్తమ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి)

  • ఉత్తమ సహాయ నటుడు - ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)


  • ఉత్తమ సహాయ నటి - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్)

  • ఉత్తమ హాస్యనటుడు - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)

  • ఉత్తమ సంగీత దర్శకుడు - బీమ్స్ (రజాకార్)

  • ఉత్తమ స్టోరీ రైటర్ - శివ పాలడుగు

  • ఉత్తమ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

  • ఉత్తమ గాయకుడు - సిద్ద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)

  • ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2)

  • ఉత్తమ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (దేవర)

  • స్పెషల్ జ్యూరీ అవార్డు - దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)

  • స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్)

  • బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ - యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)

  • 2024 ఉత్తమ బాలల చిత్రం - 35 చిన్న కథకాదు

  • బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ - హెరిటేజ్-హిస్టరీ విభాగం - రజాకార్

  • నేషనల్ ఇంటెగ్రిటీ - సోషల్‌ అప్‌లిఫ్ట్ విభాగం - కమిటీ కుర్రాళ్లు


film-award.jpg


film-award1.jpg


film-award2jpg.jpg


film-award-3jpg.jpg


ఇవి కూడా చదవండి

ఏనుగుల బీభత్సం.. ఫారెస్ట్ అధికారులపై అటాక్

ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 29 , 2025 | 11:10 AM