Nagarjuna withdrawn Defamation Case: మంత్రి కొండా సురేఖపై కేసును విత్ డ్రా చేసుకున్న నాగార్జున
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:10 PM
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై వేసిన కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెట్టిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. గతంలో నాగచైతన్య- సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 అక్టోబరు 2024న హైదరాబాద్ లంగర్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి సురేఖ.. నాగచైతన్య-సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై సీరియస్ అయిన కింగ్ నాగార్జున పరువు నష్టం దావా కేసు ఫైల్ చేశారు. BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. కేసుపై నాంపల్లి స్పెషల్ కోర్టు నేడు (గురువారం) విచారణ చేపట్టింది. అయితే, కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో కేసును విత్ డ్రా చేసుకున్నారు నాగార్జున. కాగా, ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి రెండుసార్లు క్షమాపణ చెప్పారు మంత్రి కొండా సురేఖ.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
Tummala Nageswara Rao: రైతుల సమస్యలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ