CM Revanth Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. రుద్రారంకు ఇంటర్నేషనల్ కంపెనీ
ABN , Publish Date - Apr 18 , 2025 | 07:03 PM
CM Revanth Tour: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా శుక్రవారం రెండు సంస్థలు.. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఆ క్రమంలో రుద్రారంలో తోషిబా కంపెనీ.. తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్‌లో రెండో రోజు పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. శుకవారం జపాన్ రాజధాని టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోడ్ షోకు జపాన్‌లోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికిపైగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలంటూ ఈ సందర్భంగా జపాన్ పారిశ్రామిక,వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆ క్రమంలో ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోందని రైజింగ్ బృందం తెలిపింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు,నైపుణ్యంతో కూడిన ప్రతిభ,స్థిరమైన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని వారికి సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మరోవైపు జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకొంది. రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది. అందుకోసం రూ.562 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది.
టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై తోషిబా, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయని హిరోషి ఫురుటా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల గమ్యంగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దీని ద్వారా పవర్,డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్ సామర్థ్యం విస్తరించనుంది. జీఐఎస్ తయారీ కోసం ఫ్యాక్టరీలను టీటీడీఐ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఆ క్రమంలో ఈ మూడో ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా రుద్రారంలో పరిశ్రమలు మరింత విస్తరించనున్నాయి.
ఇదే పర్యటనలో మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకొంది. ఎన్‌టీటీ డేటా- నెయిసా సంస్థ తెలంగాణలో రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదర్చుకొంది. దీంతో 400 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కానుంది.
25,000 సీపీయూలతో శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ తయారు చేయనుంది. లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో క్లస్టర్ నిర్మాణం చేపట్టనుంది. తెలంగాణలోని విద్యా సంస్థలతో భాగస్వామ్యానికి రూపకల్పన చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయం ఇదే కావడం గమనార్హం. తెలంగాణను ఏఐ రాజధానిగా తీర్చిదిద్దే ప్రాజెక్ట్ ఇదే అవనుంది. ఏడబ్ల్యూఎస్,ఎస్‌టీటీ,కంట్రోల్‌ఎస్ తర్వాత మరో మెగా ప్రాజెక్ట్ ఇదే కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి
Somireddy Chandramohan Reddy: చాలా రోజులైపోయింది చూసి.. నిద్ర పట్టడం లేదు
UttarPradesh: పోలీస్ బదిలీ.. కదిలిన ఊరి జనం
Kishan Reddy: ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి
For Telangana News And Telugu News