Share News

MLA Sudheer Reddy: మహిళా కమిషన్ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 29 , 2025 | 02:24 PM

MLA Sudheer Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్‌ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుజాతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

MLA Sudheer Reddy: మహిళా కమిషన్ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
MLA Sudheer Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (BRS MLA Devireddy Sudheer Reddy) ఈరోజు(మంగళవారం) మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని, కమిషన్ ముందుకు హాజరు కావాలంటూ సుధీర్ రెడ్డికి మహిళత కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.


కాగా.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్‌ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుజాతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సుజాతకు మద్దతుగా పలువురు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఎస్టీ మహిళా కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్‌పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారదకు ఫిర్యాదు చేశారు. ఒక ఎస్టీ మహిళను కాబట్టే తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కమిషన్ ముందు సుజాత కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను విచారణకు రావాల్సిందిగా సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Pawan On Pahalgam Attack: కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతిమంచితనం వద్దు


అలాగే ఈ వ్యవహారంపై ఎల్బీనగర్‌ పోలీసులకు కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై డీసీపీ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినట్లు సుజాత తెలిపారు. ఇలాంటి వారిని బీఆర్‌ఎస్‌ కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని కార్పొరేటర్ సుజాత నాయక్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ

Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 02:24 PM