Share News

Chanchalguda jail: అఘోరికి ఖైదీ నెంబర్ 12121

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:24 PM

ఒక మహిళ వద్ద పూజలు చేస్తానని చెప్పి అఘోరి రూ. 10 లక్షలు తీసుకుంది. మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళ పోలీస్ స్టేషన‌్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

Chanchalguda jail: అఘోరికి ఖైదీ నెంబర్ 12121
Aghori in Chanchalguda jail

హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో (Chanchalguda jail) అఘోరికి ( Aghori) పోలీసులు (Police) ప్రత్యేక బ్యారక్ (special barrack)లో ఉంచారు. అఘోరికి ఖైదీ నెంబర్ 12121 కేటాయించారు. రెండు రోజులుగా నిద్రపోకుండా గట్టి గట్టిగా కేకలు పెడుతోంది. తన భార్య వర్షిణి (Varshini)తో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారని జైలు అధికారులతో వాగ్వాదానికి దిగింది. అఘోరిపై నమోదైన కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన తర్వాత న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అఘోరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా వర్షిణితో ములాఖత్ చేయలేమంటూ అధికారులు అఘోరికి తేల్చి చెప్పారు. కాగా వర్షిణి తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి నిరాకరించడంతో ఆమెను భరోసా సెంటర్‌లో ఉంచారు. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత అఘోరి బెయిల్ ఫిటిషన్ కోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.

Also Read..: శ్రీ యంత్రం ఇంట్లో పెట్టుకున్నారంటే...


కాగా ఒక మహిళవాద్ద పూజలు చేస్తానని చెప్పి అఘోరి రూ. 10 లక్షలు తీసుకుంది. మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైల్లో అఘోరీ ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. చంచల్ గుడా జైల్‌ను నిన్న (గురువారం) మహిళ కమిషన్ చైర్ పర్సన్ నెరేళ్ల శారదా సందర్శించారు. అక్కడ మహిళా ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు ఉన్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అఘోరీని ఉంచిన బ్యారక్‌ను కూడా నెరేళ్ల శారదా పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండవ రోజు కొనసాగుతున్న AI వర్క్‌షాప్..

కేంద్రం కీలక చర్యలు.. సీమా హైదర్ పరిస్థితేంటి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం

For More AP News and Telugu News

Updated Date - Apr 25 , 2025 | 01:24 PM