Zomato delivery boy: లిఫ్టులో ఇరుక్కున్న జొమాటో డెలివరీ బాయ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:45 AM
ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన జొమాటో డెలివరీ బాయ్ మంగళవారం రాత్రి ఓ అపార్టుమెంట్‌లోని లిఫ్టులో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు అతడిని కాపాడారు. చాదర్‌ఘాట్ సీఐ కేబీ మురారి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- కాపాడిన చాదర్‌ఘాట్ పోలీసులు
హైదరాబాద్: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన జొమాటో డెలివరీ బాయ్(Zomato delivery boy) మంగళవారం రాత్రి ఓ అపార్టుమెంట్‌లోని లిఫ్టులో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు(Chaderghat Police) అతడిని కాపాడారు. చాదర్‌ఘాట్ సీఐ కేబీ మురారి తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ నివాసి చెరుకు మల్లె రాంబాబు జొమాటో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. మలక్‌పేట ప్రొఫెసర్ కాలనీ(Malakpet Professor Colony)లోని ఓ రెసిడెన్సీలోని ఫ్లాట్‌లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చాడు.
డెలివరీ చేసిన తర్వాత లిఫ్టులో కిందికి దిగేందుకు ప్రయత్నించగా లిఫ్టు ఆగిపోయింది. దీంతో ఆయన డయల్ 100కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. లిఫ్టు తలపులు పగలగొట్టి జొమాటో డెలివరీ బాయ్ రాంబాబును బయటికి తీశారు. పోలీసులకు రాంబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్
Read Latest Telangana News and National News