Hyderabad: ఆ వంతెనలు త్వరలో అందుబాటులోకి..
ABN , Publish Date - Apr 29 , 2025 | 08:33 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిప్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో నిర్మించి రెండు వంతెనలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కోట్లాది రూపాయలతో ఈ వంతెనలను నిర్మించారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇవి అందుబాటులోకి కావడం ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.

- మే 5న ఐదు ఫ్లైఓవర్లను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గడ్కరీ
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో జాతీయ రహదారులపై నిర్మించిన రెండు వంతెనల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్-ముంబై(Hyderabad-Mumbai) జాతీయ రహదారి(65)పై బీహెచ్‌ఈఎల్ వద్ద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వంతెన నిర్మించింది. జనవరి 2023లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి కావడంతో మే 5వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అంబర్‌పేట వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌తో పాటు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శాతం రాయి, శంషాబాద్, తొండుపల్లి(Shamshabad, Thondupally) ప్రాంతాల్లో నిర్మించిన వంతెనలూ అదేరోజు ప్రారంభించనున్నారు. బీహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్‌పై ట్రయల్ రన్‌లో భాగంగా 15 రోజులుగా వాహనాలను అనుమతిస్తున్నారు. వాహనాల వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రెండు రోజులకో హత్య..
శంకుస్థాపన చేసిన గడ్కరీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం
అంబర్‌పేట వంతెనపై ఇప్పటికే వాహనాల రాకపోకలు సాగుతుండగా.. అధికారికంగా నితిన్ గడ్కరీ మే 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.148 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు 2018లో గడ్కరీనే శంకుస్థాపన చేశారు. ఏడేళ్లుగా సాగిన పనులు ఎట్టకేలకు ఇటీవల పూర్తయ్యాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందు రూ. 148 కోట్ల అంచనా. ఆ తర్వాత రూ. 265.88 కోట్లకు అంచనా వేయగా పూర్తయ్యే సరికి రూ. 350 కోట్లకు చేరుకుంది. వంతెన నిర్మాణానికి 282 ఆస్తులను అధికారులు సేకరించారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా.. సర్వీస్ రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కింద నుంచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
బెంగళూరు జాతీయ రహదారిపై..
నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి అత్యంత కీలకమైంది. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు వరసలతో కూడిన ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించింది. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, గగన్‌పహాడ్, శాతం రాయి, శంషాబాద్, తొండుపల్లి ప్రాంతాల్లో జాతీయ రహదారి 44పై ఐదు ఫ్లై ఓవర్లను నిర్మించగా, ఇప్పటికే రెండింటిని ప్రారంభించారు. మిగతా మూడింటిని మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు
డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?
చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ
Read Latest Telangana News and National News