Hyderabad: థియేటర్లలో బాణాసంచా కాలిస్తే కేసులు
ABN , Publish Date - Aug 02 , 2025 | 08:37 AM
ఆర్టీసీ క్రాస్ రోడ్ సినిమా థియేటర్ల ఆవరణల్లో బాణాసంచా కాలిస్తే పోలీసు కేసులు పెడతామని మేనేజ్‌మెంట్లు హెచ్చరించాయి. ఈ మేరకు ఆయా థియేటర్‌ల ఆవరణల్లో వాల్‌పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

- ఆవరణలో బోర్డులు ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్లు
హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్ సినిమా థియేటర్ల ఆవరణల్లో బాణాసంచా కాలిస్తే పోలీసు కేసులు పెడతామని మేనేజ్‌మెంట్లు హెచ్చరించాయి. ఈ మేరకు ఆయా థియేటర్‌ల ఆవరణల్లో వాల్‌పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. గతేడాది డిసెంబర్ 4వ తేదీన రాత్రి ఓ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుస్సంఘటన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) నటించిన దేవర సినిమా విడుదల సందర్భంగా అభిమానులు బాణాసంచా కాలుస్తుండగా ఎన్టీఆర్ భారీ కటౌట్ కాలి బూడిదైన విషయం విదితమే. కొత్త సినిమాలు, ప్రముఖ హీరోలు నటించిన సినిమాలు విడుదల సందర్భంగా ప్రీమియర్ షోల సమయాల్లో తప్పనిసరిగా టికెట్లు ఉన్న ప్రేక్షకులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.
ఈ మేరకు ఇటీవల ప్రముఖ హీరో పవన్‌కల్యాణ్ సినిమా హరిహరవీరమల్లు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో ఎలాంటి అర్భాటాలు లేకుండా బాణాసంచా కాల్చే సంఘటనలు జరగకుండా 80 మంది పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకున్నారు. కాగా గురువారం విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా విడుదల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు కల్వకుంట్ల తన స్నేహితులతో సినిమా చూడ్డానికి వచ్చారు. దీంతో ఎలాంటి ఆర్బాటం లేకుండా థియేటర్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News