Electricity: ఆ ఏరియాల్లో.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా బంద్..
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:58 AM
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

- నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ(ADE G.Gopi) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ ఊడ్స్ అపార్ట్‌మెంట్, ఎమ్మెల్యే కాలనీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ ఆరోగ్యశ్రీ, లోటస్ పాండ్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు..
కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంజనేయనగర్, జనతానగర్, మూసాపేట్, ఇంద్రానగర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, హబీబ్‌నగర్, పవర్‌నగర్, ప్రగతినగర్, మూసాపేట్ వార్డు ఆఫీస్, టి.అంజయ్యనగర్, శివశక్తినగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు. ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు
అల్లాపూర్: అల్లాపూర్ డివిజన్‌లో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉండనుందని ఏఈ రాకే్‌షగౌడ్ పేర్కొన్నారు. 11 కేవీ అల్లాపూర్ ఫీడర్ ఎమనేటింగ్ ఫ్రం అయ్యప్ప సొసైటీ సబ్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్, జ్యోతినగర్, లక్ష్మినగర్, చంద్రాగార్డెన్స్, శివబస్తీ ప్రాంతాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారి తెలిపారు. మరో ఫీడరు 11 కేవీ పర్వత్‌నగర్ ఫీడర్ ఎమనేటింగ్ ఫ్రం అయ్యప్ప సొసైటీ సబ్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్, పర్వత్‌నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాకేశ్ తెలిపారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్, స్పెన్సర్, రేణుకా ఎన్‌క్లేవ్, తాళ్లబస్తీ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, దయారామార్కెట్, బంజారా ఎవెన్యూ, రామకృష్ణమఠ్, దోమలగూడ పరిధుల్లో 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా హైటెన్షన్ లైన్ ఫీడర్ పరిధిలోని శంక్‌కాలనీ, శివపురి, చంద్రపురి, నేతాజీనగర్, అశోక్ మణిపురి, ప్రధమపురి, అశోక్ ఎన్‌క్లేవ్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు, శాలివాహన ఫీడర్ పరిధిలోని శాలివాహన ఎన్‌క్లేవ్, కృష్ణానగర్, గౌరీనాథపురం, పద్మారావునగర్, హైటెక్ కాలనీ, తాళ్లబాయి, దాబాగార్డెన్స్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, మనోజ్ ఎన్‌క్లేవ్, ఓల్డ్ కాప్రా పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు సైనిక్‌పురి సబ్‌స్టేషన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు.
వినాయక్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో..
మల్కాజిగిరి: వినాయక్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతారాయం ఏర్పడనుంది. 11 కేవీ డైట్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎల్‌బీనగర్, వినాయక్‌నగర్ బ్లాక్-2, దినకర్‌నగర్, నేరేడ్‌మెట్ విలేజ్, న్యూ విద్యానగర్, కేశవనగర్, డైట్ కళాశాల, దేవీనగర్ పార్టు, భగత్‌సింగ్‌నగర్ 11 కేవీ దేవినగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు కృపా కాంప్లెక్స్, శ్రీకృష్ణనగర్, సీతారామనగర్, సైనిక్‌నగర్, రామబ్రహ్మనగర్, దేవినగర్‌లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సుమన్ క్రిస్టియానా తెలిపారు.
సాకేత్ సబ్‌స్టేషన్ పరిధిలో..
ఏఎస్ రావునగర్: సాకేత్ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రణామ్ ఫీడర్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు కుషాయిగూడ ఏఈ ఆర్.రామకృష్ణ తెలిపారు. సాకేత్-2, సాకేత్-3, శ్రీయుగ ఎన్‌క్లేవ్, ప్రణామ్ అపార్టుమెంట్ కాలనీలలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు
Read Latest Telangana News and National News