Share News

కేంద్రం పరిశీలనలో మెట్రో ఫేజ్‌-2 డీపీఆర్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:39 AM

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అన్నారు.

కేంద్రం పరిశీలనలో మెట్రో ఫేజ్‌-2 డీపీఆర్‌

  • కిషన్‌రెడ్డితో భేటీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డితో బుధవారం జరిగిన భేటీలో ఖట్టర్‌ వ్యాఖ్యానించారు.


కేంద్ర పట్టణాభివృద్థి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్థి కార్యక్రమాల స్థితిపై ఇరువురు నేతలు ఈ భేటీలో చర్చించారు. అలాగే, హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై కూడా మాట్లాడుకున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 03:39 AM