Share News

Puppies: మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 18 , 2025 | 10:22 AM

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం ఇక్కడ సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లలను కొట్టిచంపాడో నీచుడు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Puppies: మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. అసలేం జరిగిందంటే..

- గోడకు విసిరి కొట్టి, కాలుతో తొక్కి..

- కుక్కపిల్లలపై దారుణం

- కళ్లు కూడా తెరవని 4 పిల్లలు మృతి

- గేటెడ్‌ కమ్యూనిటీలో ఘటన

- కఠినంగా శిక్షించాలి: జంతు ప్రేమికులు


హైదరాబాద్: చూడగానే ముద్దొచ్చే కుక్క పిల్లలను కిరాతకంగా చంపిన ఘటన అల్వాల్‌ పోలీస్‏స్టేషన్‌(Alwal Police Station) పరిధిలో జరిగింది. ఇంకా కళ్లు కూడా తెరవని కూనలను అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ గోడలకు, పిల్లర్లకు విసురుతూ, కాలుతో తొక్కుతూ దారుణంగా చంపి రాక్షసానందాన్ని పొందినట్లు సీసీ టీవీ ఫుటేజీలో బయటపడింది. అల్వాల్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ రాహుల్‌దేవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారంలోని ఇండిస్‌ వీబీసీటీ గేటెడ్‌ కమ్యూనిటీకి ఆరు నెలల క్రితం ఆశిష్‌ (32) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి అద్దెకు వచ్చాడు.

ఈ వార్తను కూడా చదవండి: Kachiguda: కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 109 ఏళ్లు..


ఆశిష్‏కు బాలానగర్‌(Balanagar)లో ఇంటీరియర్‌ షాప్‌ ఉంది. ఈ నెల 14వ తేదీన ఆశిష్‌ తన ఫ్లాట్‌ నుంచి పెంపుడు కుక్కతో కలిసి సెల్లార్‌కు వచ్చాడు. సెల్లార్‌లో వీధికుక్కకు పుట్టిన పిల్లలు ఉన్నాయి. అవి తన పెంపుడు కుక్కపైకి వస్తున్నాయని వాటిని క్రూరంగా హతమార్చాడు. నేలపైనా, సెల్లార్‌ పిల్లర్లకు బలంగా విసిరి, ఇటుకలతో బాది, కాలుతో తొక్కి దారుణంగా నాలుగు కుక్క పిల్లలను చంపాడు.


కుక్కపిల్లలు తీవ్రగాయాలతో సెల్లార్‌లో చనిపోయి ఉండటాన్ని చూసి అపార్ట్‌మెంట్‌వాసులు షాక్‌కు గురయ్యారు. ఇంత దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయం తెలుసుకోవడానికి సీసీఫుటేజీని పరిశీలించగా, ఆశిష్‌ వాటిని చంపిన తీరును చూసి నిర్ఘాంతపోయారు. అతడిపై అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేటెడ్‌ కమ్యూనిటీలోకి వచ్చే వీధికుక్కలపై ఆశిష్‌ రాళ్లు, కర్రలతో దాడి చేసేవాడని ఇదే కమ్యూనిటీలో నివసించే సత్తర్‌ఖాన్‌ తెలిపారు. అతడిపై జంతు సంరక్షణ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్

అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

నదిలో పడవ బోల్తా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 10:53 AM