Hyderabad: ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐటీ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ డెసిషన్..
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:27 PM
ఐటీ ఉద్యోగి పెళ్లి నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అనిల్ అనే యువకుడికి ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే..

హైదరాబాద్: ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లి అంటేనే భయపడుతున్నారు. భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం వంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. పెళ్లి ద్వారా కొంతమందికి మనశ్శాంతి లభిస్తే, మరికొందరికి కష్టాలు ఎదురవుతాయి. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను రా దేవుడా అంటూ కొందరు బాధపడుతుంటే మరికొందరు మాత్రం ఇంకా పెళ్లి సెట్ కాలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకొందరు అయితే తమకు పెళ్లి ఇష్టం లేదని బలవ్మరణానికి పాల్పడతారు. అయితే, పెళ్లి నిరాశతో ఒక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
హఫీజ్పేట్‌లోని లక్ష్మీ ప్రియ నివాసంలో తల్లిదండ్రులతోపాటు అనిల్ అమిత్ చౌడ (30) అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతను నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల అనిల్‌కు ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహం నవంబర్‌లో చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే, ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, గత రాత్రి ఇంట్లోని గదిలోకి వెళ్లి అనిల్ తలుపు వేసుకున్నాడు. ఉదయం ఎంతసేపటికి అనిల్ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపు బద్దలు కొట్టారు. తీరా గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అనిల్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయితే, నవంబర్‌లో జరగనున్న వివాహం కారణంగానే అనిల్ కొంత నిరాశతో ఉన్నాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అనిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదా? బలవంతంగా ఎంగేజ్మెంట్ చేశారా? అందుకే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు