Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు కొట్టివేత
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:05 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.

హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. చౌటుప్పల్ మండలం లక్కారంలో రేషన్ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన సభలో గందరగోళం సృష్టించారంటూ ఆయనపై కేసు నమోదయింది. నాటి మంత్రి జగదీశ్‌రెడ్డి నుంచి మైక్ లాక్కున్నారని, కార్యక్రమ నిర్వహణను అడ్డుకున్నారంటూ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News