Share News

CPR: గుండె నొప్పితో కుప్పకూలిన వ్యక్తి

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:02 AM

ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి గుండె నొప్పి రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్పందించిన ఆస్పత్రి ఉద్యోగి సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాలు కాపాడాడు.

CPR: గుండె నొప్పితో కుప్పకూలిన వ్యక్తి

  • సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన నిమ్స్‌ ఉద్యోగి

నిమ్స్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి గుండె నొప్పి రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్పందించిన ఆస్పత్రి ఉద్యోగి సీపీఆర్‌ చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిమ్స్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా పెద్ద నక్కలపేట్‌ గ్రామానికి చెందిన బగ్గి అశోక్‌ తన భార్య లక్ష్మితో కలిసి గత బుధవారం నిమ్స్‌ జనరల్‌ మెడిసన్‌ విభాగానికి వైద్య పరీక్షల కోసం వచ్చాడు. అక్కడ అశోక్‌కి గుండె నొప్పి రావడంతో కూలబడిపోయాడు.


32వ రూమ్‌ ఓపీడీలో విధుల్లో ఉన్న శ్రీనివాస్‌..వెంటనే అతనికి సీపీఆర్‌ చేశాడు. అనంతరం ట్రాలీలో ఏఎమ్సీ వార్డుకు తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడాడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి రోగి ప్రాణాలు కాపాడిన శ్రీనివా్‌సను నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప అభినందించారు. ప్రస్తుతం అశోక్‌ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

Updated Date - Jun 24 , 2025 | 04:03 AM