Jogulamba: జోగులాంబ ఆలయ అర్చకుడికి హైకోర్టు ఊరట
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:15 AM
జోగులాంబ ఆలయ పూజారి డి. ఆనంద్‌శర్మ సస్పెన్షన్‌ను హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పిటిషన్‌ను విచారించిన తర్వాత తదుపరి విచారణ జూన్ 26కి వాయిదా పడింది

ఆనంద్ శర్మ సస్పెన్షన్ నిలిపివేత
హైదరాబాద్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఆలయ పూజారి డి.ఆనంద్‌శర్మ సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 26కు వాయిదా వేస్తూ, ఆలోగా కౌంటర్ సమర్పించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఫోటో తీశారనే కారణంతో ఉన్నతాధికారులు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆనంద్‌శర్మ పిటిషన్ దాఖలు చేయగా.. మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.