Medigadda: మేడిగడ్డకు భారీ వరద
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:53 AM
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. మహరాష్ట్రలోని వెయిన్‌గంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 3.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.

2.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, గేట్లన్నీ ఓపెన్
త్రివేణి సంగమం వద్ద పెరిగిన వరద
ఒక్క రోజులో 5 అడుగులు పెరిగిన సాగర్ నీటిమట్టం
మహదేవపూర్ రూరల్/ నాగార్జున సాగర్/ మహబూబ్‌నగర్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. మహరాష్ట్రలోని వెయిన్‌గంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 3.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. బుధవారం మేడిగడ్డకు వస్తున్న 2.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదను బ్యారేజీ 85 గేట్లెత్తి దిగువకు పంపిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 3.90 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్న గోదావరి.. వెయిన్‌గంగా వరద నీరు జత కలిసి ఇన్‌ఫ్లో మూడింతలు పెరుగొచ్చని అధికారులు తెలిపారు. కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద బుధవారం గోదావరి వరద 7.20 మీటర్లు పెరగడంతో ఘాట్ మెట్ల వద్ద జాగ్రత్తలు పాటించాలని భక్తులకు అధికారులు సూచించారు.
181.9292 టీఎంసీలకు సాగర్ నిల్వ
ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,17,868 క్యూసెక్కుల నీటి విడుదలతో నాగార్జున సాగర్ నీటిమట్టం బుధవారం 531.30 అడుగుల నుంచి 536.90 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీల సామర్థ్యం బుధవారం సాయంత్రానికి 536.90 అడుగులతో 181.9292 టీఎంసీలకు చేరుకుంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తడంతో 1.68 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 201.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆలమట్టికి ప్రస్తుతం 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డవుతుండగా, 1.15 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో, నారాయణపూర్‌కు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, దిగువకు 95,760 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన జూరాల వద్ద 1.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1.26 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో రికార్డవుతోంది.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి