Share News

SriSailam Project: శ్రీశైలానికి పెరిగిన ఉధృతి!

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:57 AM

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ప్రాజెక్టు సైట్‌ వద్ద 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా ఎనిమిది క్రస్ట్‌ గేట్లను పది ఫీట్ల మేర

SriSailam Project: శ్రీశైలానికి పెరిగిన ఉధృతి!

  • ప్రాజెక్టులోకి 2.89 లక్షల క్యూసెక్కులు

  • దిగువకు 3.18 లక్షల క్యూసెక్కులు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ప్రాజెక్టు సైట్‌ వద్ద 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా ఎనిమిది క్రస్ట్‌ గేట్లను పది ఫీట్ల మేర ఎత్తి 2.16 లక్షల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, ఎంజీకేఎల్‌ఐతో కలుపుకొని మొత్తం 3.18 లక్షల క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన ఆలమట్టి రిజర్వాయర్‌కు 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1.40లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి 1.45లక్షల క్యూసెక్కులను జూరాలకు.. జూరాల నుంచి 1.48 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. తుంగభద్ర వద్ద 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 1.24 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. ఇక నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని టెయిల్‌పాండ్‌కు 2,38,468 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు 20గేట్లలో 11గేట్లను ఎత్తి 2,36,727 క్యూసెక్కుల నీటిని పులిచింతల వైపు వదులుతున్నారు. టెయిల్‌పాండ్‌ నిల్వ సామర్ధ్యం సుమారు 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.764 టీఎంసీల నీరు ఉంది. అటు.. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.


ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు అధికారులు మొత్తం 23 గేట్లలో మూడు రేడియల్‌ గేట్లు రెండు మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 175 అడుగులు (45.77 టీఎంసీలు) కాగా, మంగళవారం రాత్రి 165.123 అడుగులుగా (31.7965 టీఎంసీలు) నమోదైంది. ఎగువనుంచి ఇన్‌ఫ్లో 2,41,285 క్యూసెక్కుల నీరు వస్తుండగా, రేడియల్‌ గేట్ల ద్వారా 47,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌ పరిధిలో జలవిద్యుదుత్పత్తి జోరందుకుంది జూరాలలో 3.96 మిలియన్‌ యూనిట్లు, శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో 17.14 మిలియన్‌ యూనిట్లు, నాగార్జునసాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో 17.19 మిలియన్‌ యూనిట్లు, సాగర్‌ ఎడమ కాల్వ కింద 0.73మిలియన్‌ యూనిట్లు, పులిచింతలలో 0.65మిలియన్‌ యూనిట్లు కలిపి 42.88 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుదుత్పత్తి జరుగుతోంది. ఇక గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌కు ఈ సీజన్‌లో అత ్యధికంగా 75 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా... ప్రాజెక్టులో 32.90 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:57 AM