Share News

Home Guards Salary: రేవంత్‌.. హోంగార్డులకు జీతాలివ్వు

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:46 AM

పథకాల్లో కోతలు.. మాటల్లో గొప్పలు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు కాదు.. నెలాఖరు వస్తోంది..

Home Guards Salary: రేవంత్‌.. హోంగార్డులకు జీతాలివ్వు

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ‘‘పథకాల్లో కోతలు.. మాటల్లో గొప్పలు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు కాదు.. నెలాఖరు వస్తోంది.. హోంగార్డులకు జీతాలివ్వు’’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 22వ తారీఖు వచ్చినా ఇప్పటి వరకు జీతాలు రాక భద్రాది కొత్తగూడెం, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జగిత్యాల, వరంగల్‌, రామగుండం, వికారాబాద్‌ జిల్లాల్లో పనిచేస్తున్న హోంగార్డులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చిన్న జీతాలపై జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక ఇంటి అద్దె, పిల్లల స్కూల్‌ ఫీజులు, రోజు వారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వివరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రిగా ఉన్న హోంశాఖలోనే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉంటే ఎలా..? అని ప్రశ్నించారు. వెంటనే హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌ రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:46 AM