Harish Rao: ప్రజాభవన్ సాక్షిగా రేవంత్ తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:56 AM
ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీపై నిందారోపణలు చేసేందుకు నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకొంటోందని పేర్కొన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నది వాస్తవం కాదా?
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టిందనడం అబద్ధం
తెలంగాణ ద్రోహులంతా ప్రజా భవన్‌లో చేరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం:హరీశ్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీపై నిందారోపణలు చేసేందుకు నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకొంటోందని పేర్కొన్నారు. తెలంగాణవాదులు బయట ఉంటే, తెలంగాణ ద్రోహులంతా ప్రజా భవన్‌లో చేరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆరోపించారు. పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేేస్త.. అది పక్కనబెట్టి సీఎం రేవంత్, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పనికిరాని పీపీటీలతో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలను విస్మరించామని ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించకుండా వాస్తమేంటో తెలుసుకోవాలన్నారు. ఏ సమస్య లేకున్నా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టిందనడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టిందని, ప్రాణహిత డిజైన్‌తో 3 వేల ఎకరాలకు పైగా ముంపు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర జలసంఘం నీటి లభ్యత లేదని చెప్పిందని, చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యంతో తుమ్మడిహెట్టి ప్రాజెక్టుకు సమస్య ఉండటం వాస్తవం కాదా? అని నిలదీశారు. ‘2007లో మొదలుపెట్టిన ప్రాజెక్టును 2014 వరకు ఎందుకు పూర్తిచేయలేదు.
కనీసం అనుమతులు ఎందుకు సాధించలేదు. కేంద్రంలో, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉండి చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారో సమాధాన ం ఇవ్వాలి’ అని అన్నారు. కమీషన్ల కోసం అంచనాలు పెంచామంటున్న ఉత్తమ్.. ఏ కమీషన్లు దండుకునేందుకు ఈ ప్రాజెక్టు వ్యయం 17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు అంచనాలు పెంచారు? ఎవరి జేబుల్లోకి అవి వెళ్లాయో వివరించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 70 మండలాలు, 1,226 గ్రామాల్లోని 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లిచ్చే విషయాన్ని దాచిపెట్టే కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లిచ్చిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్‌రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు తెలంగాణ నీటి హక్కులను కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కృష్ణా నీళ్లను పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు తరలిస్తుంటే హారతులు పట్టిన నాటి కాంగ్రె్‌సమంత్రులను కొరడా దెబ్బలు కొట్టాలన్నారు. ఇప్పుడు బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణానీళ్లను దారాదత్తం చేేసందుకు కుట్రచేస్తున్న నిన్ను కూడా కొరడా దెబ్బలు కొట్టాలని రేవంత్‌ని ఉద్దేశించి అన్నారు. ‘అసెంబ్లీకి నిపుణులను పిలవడం కాదు, నీ జూబ్లీహిల్స్ ప్యాలె్‌సకు పిలుచుకొని మాట్లాడి తర్వాత సుద్దులు చెప్పాలి’ అని రేవంత్‌కి సూచించారు. రైతు ప్రయోజనాలకంటే రేవంత్‌కు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని, తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రాకు నీళ్లు తరలించడంపైనే దృష్టి ఎక్కువని విమర్శించారు. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడకముందే ఒప్పుకొని మరణశాసనం రాసిందే కాంగ్రెస్ అని, మీ పార్టీ ఆనాడు చేసిన తప్పువల్లే తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తోందన్నారు.
శాసనసభ, మండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం..
‘ఇరిగేషన్‌పై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్‌రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలువలేదు. నీ సవాల్‌లో నిజాయితీ ఉంటే ప్రజా భవన్‌కు ఎందుకు ఆహ్వానించలేదు’ అని హరీశ్ ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రజాభవన్‌లో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఈ చర్యతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రివిలేజ్‌కు భంగం కల్పించినందుకుగాను శాసనసభ స్పీకర్‌కు, శాసనమండలి చైర్మన్‌కు బీఆర్‌ఎస్ తరఫున ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి