Share News

Traffic Fines: చీటికిమాటికి ట్రాఫిక్‌ చలాన్లు వేయకుండా చర్యలు తీసుకోవాలి: వీహెచ్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:39 AM

పోలీసులు చీటికి మాటికి ట్రాఫిక్‌ చలాన్లు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కోరారు.

Traffic Fines: చీటికిమాటికి ట్రాఫిక్‌ చలాన్లు వేయకుండా చర్యలు తీసుకోవాలి: వీహెచ్‌

పోలీసులు చీటికి మాటికి ట్రాఫిక్‌ చలాన్లు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు కోరారు. ట్రాఫిక్‌ పోలీసులు ద్విచక్రవాహనదారులను లక్ష్యంగా చేసుకుని చలాన్లు వేస్తున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకమని.. చీటికిమాటికి పోలీసులు వేసే ట్రాఫిక్‌ చలాన్లతో పార్టీపై ప్రభావం చూపే అవకాశముంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసేందుకు సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 11 , 2025 | 04:39 AM