Share News

Group 1 mains: గ్రూప్‌-1 పిటిషన్లపై కొనసాగిన వాదనలు

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:53 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ ముల్యాంకనంలో లోపాలు, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్‌ రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ కొనసాగించింది.

Group 1 mains: గ్రూప్‌-1 పిటిషన్లపై కొనసాగిన వాదనలు

హైదరాబాద్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ ముల్యాంకనంలో లోపాలు, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్‌ రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సురేందర్‌రావు, రచనారెడ్డి తదితరులు వాదించారు. రెండుసార్లు హాల్‌టికెట్లు ఇవ్వడం, పరీక్ష కేంద్రాల కేటాయింపు అంశాలను ప్రస్తావించారు.


ఒకే పేపర్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది దిద్దారని ఆరోపించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదాపడింది. కాగా, డాక్యుమెంట్లు, అర్హత పత్రాలు సరిగా లేని ఆరుగురు అడ్వొకేట్లను రోల్స్‌ నుంచి తొలగించినట్లు బార్‌ కౌన్సిల్‌ పేర్కొంది.

Updated Date - Jul 02 , 2025 | 03:53 AM