Power Supply: వచ్చే ఏడాది 19500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్
ABN , Publish Date - May 04 , 2025 | 03:51 AM
రానున్న ఐదేళ్లలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్తు సరఫరా చేసేందుకు గాను విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచి బలోపేతం చేయాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో సీఎండీ సందీ్‌పకుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.

తదనుగుణంగా నెట్‌వర్క్ బలోపేతం చేయాలి
ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): రానున్న ఐదేళ్లలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్తు సరఫరా చేసేందుకు గాను విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచి బలోపేతం చేయాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో సీఎండీ సందీ్‌పకుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గరిష్ట విద్యుత్తు డిమాండ్ అంచనాలకు మించి పెరుగుతోందన్నారు. 2025లో 16,877 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడనుందని కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) అంచనా వేయగా, వాస్తవ గరిష్ఠ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. వచ్చే ఏడాది 18,138 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండనుందని సీఈఏ అంచనా వేయగా, వాస్తవ డిమాండ్ 19,000-19,500 మెగావాట్ల వరకు చేరుకోవచ్చునని అంచనా వేశామన్నారు. ఈ మేరకు విద్యుత్తు సరఫరా చేసేందుకు గాను విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించారు.
6వేల ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 2030 నాటికి 6వేల ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సందీ్‌పకుమార్ సుల్తానియా తెలిపారు. చార్జింగ్ పాయింట్ల ఆపరేటర్లతో శనివారం విద్యుత్తుసౌధలో సమావేశమయ్యారు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, త్వరితగతిన వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ఏర్పాటు విషయంలో ఆపరేటర్లకు సహకరించడానికి విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్), తెలంగాణ పునరుద్థరణీయ ఇంధన వనరుల అభివృద్థి సంస్థ(రెడ్కో)లు చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..