Mining: పారదర్శకంగా మైన్స్ లీజులు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:35 AM
మైనింగ్ లీజులు ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజ్ చెప్పారు.

వచ్చే నెల 12 నుంచి 16 వరకు టెండర్లు
తాండూరు అవగాహనా సదస్సులో భూగర్భ గనులశాఖ డీడీ గోవిందరాజ్
తాండూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మైనింగ్ లీజులు ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజ్ చెప్పారు. భూగర్భ గనులశాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని స్టోన్ భవనంలో సోమవారం క్వారీ లీజ్ దారులు, ట్రేడర్లకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు.
టెండర్ల ప్రక్రియ వెరిఫికేషన్ కోసం రూ.10 వేలు, పాస్‌పోర్ట్ కోసం రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో 25 బ్లాక్‌ల వివరాలు వస్తాయన్నారు. భూగర్భ గనులశాఖ తాండూరు ఏడీ సత్యనారాయణ మాట్లాడుతూ తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నాలుగు రకాల మైనింగ్ బ్లాక్‌లు ఉన్నాయని చెప్పారు.