Gaddar Foundation: గద్దర్‌పై రాసిన రచనలకు ఆహ్వానం
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:38 AM
ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్య, సాంస్కృతిక కృషిని తెలియజేస్తూ వచ్చిన పాటలు, కవిత్వం, వ్యాసాలను ఆహ్వానిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జీవీ సూర్యకిరణ్ తెలిపారు.

బర్కత్‌పుర, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్య, సాంస్కృతిక కృషిని తెలియజేస్తూ వచ్చిన పాటలు, కవిత్వం, వ్యాసాలను ఆహ్వానిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జీవీ సూర్యకిరణ్ తెలిపారు. సమాజానికి గద్దర్ చేసిన సేవలు, పోరాట చరిత్రను తెలియజేస్తూ అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు ఇప్పటికే అనేక రచనలు చేశారని ఆయన పేర్కొన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఈ రచనలన్నింటినీ పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజలకు అందించాలనే లక్ష్యం పెట్టుకుందన్నారు.
మీరు గద్దర్‌పై రాసిన పాటలు, కవిత్వం, వ్యాసాలు ఏవైనా ఉంటే 7396065999కు వాట్సాప్ చేయాలని సూచించారు. మరింత సమాచారం కోసం 900074418ను సంప్రదించాలన్నారు. రచనలు పంపేవారు తమ అడ్రస్, ఫోన్ నెంబర్‌తో పాటు ఒక పాస్ ఫొటోను కూడా పంపించాలని సూర్యకిరణ్ కోరారు.