Home » Gaddar
భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి మాత్రమే .....
గద్దర్ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్‌డీసీ చైర్మన్, స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి ఈ అవార్డులను ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..
గద్దర్ పేరు మీద అవార్డులను రెండో ఏడాది ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉగాది పర్వదినం రోజు.. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.
ప్రముఖ ప్రజా గాయకుడు, విప్లవ కవి గద్దర్ కూతురు వెన్నెల ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా ఆమె ఒక వినతిపత్రం అందజేశారు. తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన విశేష సేవలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్య, సాంస్కృతిక కృషిని తెలియజేస్తూ వచ్చిన పాటలు, కవిత్వం, వ్యాసాలను ఆహ్వానిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జీవీ సూర్యకిరణ్ తెలిపారు.
గద్దర్ అవార్డుల ప్రదానంతో సినీ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం తీసుకువచ్చిందని టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామని ఆయన అన్నారు.
ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసి న తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.