Share News

Additional Judges: ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు అదనపు జడ్జీలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:43 AM

నూతనంగా నియామకమైన నలుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌, జస్టిస్‌ చలపతిరావు

Additional Judges: ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు అదనపు జడ్జీలు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నూతనంగా నియామకమైన నలుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులు- జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌, జస్టిస్‌ చలపతిరావు, జస్టిస్‌ రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్‌లో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సింగ్‌ వారితో ప్రమాణం చేయించారు. అంతకుముందు రిజిస్ట్రార్‌ జనరల్‌ గోవర్ధన్‌రెడ్డి రాష్ట్రపతి కార్యాలయం జారీచేసిన నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం నూతన జడ్జీలు ఆయా డివిజన్‌ బెంచ్‌లలో కేసులను విచారణకు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, నూతన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్‌, రజినీకాంత్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, బార్‌ అధ్యక్షుడు జగన్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, సునీల్‌గౌడ్‌లు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:43 AM