R S Praveen Kumar: అప్పుడో మాట.. ఇప్పుడో మాట!
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:13 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు ఉన్నతాధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ మాట మార్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన ఆయన..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాట మార్చిన ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్
కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించారని గతంలో ఫిర్యాదు
ఇప్పుడు అదేం లేదని వెల్లడి
కాంగ్రెస్, బీజేపీ కలిసే ట్యాపింగ్ చేస్తున్నాయని ఆరోపణ
సిట్ విచారణకు హాజరు
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు ఉన్నతాధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ మాట మార్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన ఆయన.. బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పడం విశేషం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహచర మంత్రులతోపాటు తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్ గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడమే కాకుండా పలు నియోజకవర్గాల నుంచి బీఎస్పీ అభ్యర్థులను బరిలో నిలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ను హ్యాక్ చేస్తోందని, ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రవీణ్‌కుమార్ నాటి డీజీపీ, ఎన్నికల సంఘంతో పాటు పంజాగుట్ట పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి, ఆయన వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రవీణ్‌కుమార్ బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్ అధికారులు.. గతంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలంటూ రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. సోమవారం ప్రవీణ్‌కుమార్ జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చారు.
విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్ కేసులో మాట మార్చేశారు. బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే క్యాబినెట్ మంత్రులతో పాటు తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. పెగాసెస్ వంటి సాఫ్ట్‌వేర్, డార్క్‌వెబ్‌సైట్‌లో కొన్ని అరుదైన టూల్స్ ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తులతో ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సిట్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ను పావుగా వాడుకుంటోందన్నారు. అందుకే రేవంత్‌రెడ్డి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. రేవంత్ చేసే ఫోన్ ట్యాపింగ్‌కు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మద్దతు కూడా ఉందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని చెప్పారు. మంత్రులతో పాటు వ్యాపారవేత్తలు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తు న్నారంటూ సౌత్‌ఫ్‌స్టలో ప్రచురించిన వార్తల ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయాలన్న కుట్రలోభాగంగానే ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు, బీఆర్‌ఎ్‌సకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..