Share News

Yadagirigutta: యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:46 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Yadagirigutta: యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా తొలి ఏకాదశి పూజలు

  • వేములవాడలో రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

యాదగిరిగుట్ట, వేములవాడ కల్చరల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అఽధిష్టింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వివిధ రకాల పుష్పాలతో వైభవంగా లక్ష పుష్పార్చన చేపట్టారు.


అర్చకులు తొలి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. 40వేలమంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ ఖజానాకు రూ. 57,28,842 ఆదాయం సమకూరింది. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రాజరాజేశ్వర స్వామివారితో పాటుగా పరివార దేవతలకు అభిషేకం, అర్చనలు చేశారు.

Updated Date - Jul 07 , 2025 | 02:46 AM