Urea Distribution: యూరియా కోసం 5 గంటలకే క్యూ
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:12 AM
యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండంలోని కల్లూరు, చెన్నూరు

కల్లూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండంలోని కల్లూరు, చెన్నూరు ప్రాథమిక సహకార సంఘాల వద్దకు మంగళవారం తెల్లవారుజామునే రైతులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కూపన్లు పంపిణీ చేసే సమయంలో రైతుల మధ్య తోపులాట జరగటంతో సీఐ, ఎస్‌ఐ అదనపు సిబ్బందితో అక్కడికి వచ్చారు.
పోలీసు బందోబస్తు నడుమ కూపన్లు పంచారు. కల్లూరు, చెన్నూరు పీఏసీఎ్‌సలకు సగటున 20 టన్నుల వరకు యూరియా బస్తాలు రాగా గంటల వ్యవధిలోనే అయిపోయాయి. కల్లూరు మండలంలో అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉందని ఏవో రూప తెలిపారు.