Uttam: ఈఈలుగా పదోన్నతులు కల్పించండి
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:02 AM
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)లుగా 12-13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారిని తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ)లుగా పదోన్నతి కల్పించాలని 2004 బ్యాచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీర్లు ప్రభుత్వాన్ని కోరారు.

మంత్రి ఉత్తమ్‌ను కోరిన 2004 బ్యాచ్ ఇంజనీర్లు
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈ)లుగా 12-13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారిని తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఈఈ)లుగా పదోన్నతి కల్పించాలని 2004 బ్యాచ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీర్లు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ని కలిసి, వినతిపత్రాన్ని అందించారు. శాఖలో తమకంటే జూనియర్లకు ఈఈలుగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారని, ఈ నియామకాలన్నీ రద్దు చేయాలని కోరారు.
భవిష్యత్తులో ఎఫ్‌ఏసీలుగా జూనియర్లకు అవకాశం ఇవ్వకుండా రెగ్యులర్ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2009 తర్వాత రెగ్యులర్ ప్యానల్ లిస్టు సిద్ధం కాలేదని, తక్షణమే 2004 బ్యాచ్ డిప్యూటీ ఈఈలకు పదోన్నతులు కల్పించి, న్యాయం చేయాలని కోరారు. పదోన్నతుల అంశాన్ని వెనువెంటనే పరిష్కరిస్తామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.