Manda Krishna: గవాయ్ సీజేఐ అవడం దేశానికే గర్వకారణం
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:21 AM
సామాజిక న్యాయం పట్ల లోతైన అవగాహన ఉన్న మేధావి, రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం దేశానికే గర్వకారణమని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కొనియాడారు.

ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం పట్ల లోతైన అవగాహన ఉన్న మేధావి, రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం దేశానికే గర్వకారణమని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కొనియాడారు. జస్టిస్ గవాయ్‌ని ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘‘గవాయ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద నిర్దిష్టమైన, న్యాయమైన అభిప్రాయం కలిగిన సమానత్వవాది.
ఎన్నో చారిత్రక తీర్పులు వెలువరించి న్యాయవ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకాన్ని పెంచిన న్యాయ కోవిదుడు’’ అని కొనియాడారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీని అలంకరించిన రెండో దళిత ముద్దుబిడ్డ అని ఆనందం వ్యక్తం చేశారు.