Nalgonda: నా కోడిని కొట్టినోడిని జైల్లో పెట్టాల్సిందే !
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:46 AM
మా పక్కంటి ఆయన నా కోడి కాళ్లు విరగొట్టాడు. అతనిపై కేసు నమోదు చేసి శిక్షించండి.. అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.

నకిరేకల్ పోలీసులను ఆశ్రయించిన ఓ వృద్ధురాలు
నష్టపరిహారం ఇప్పిస్తామన్న ససేమిరా
నకిరేకల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మా పక్కంటి ఆయన నా కోడి కాళ్లు విరగొట్టాడు. అతనిపై కేసు నమోదు చేసి శిక్షించండి.. అంటూ ఓ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. గాయపడిన కోడిని తీసుకుని మరీ స్టేషన్‌కు వచ్చిన ఆ వృద్ధురాలికి నష్టపరిహారం ఇప్పిస్తామని పోలీసులు చెప్పినా ససేమిరా అన్న ఆమె నిందితుడిని శిక్షించాల్సిందేనని పట్టుబట్టింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడేనికి చెందిన కడారి గంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి వద్ద నాటు కోళ్లను పెంచుతోంది. గంగమ్మ పక్కంటిలో ఉండే చిర్రబోయిన రాకేశ్.. గేదెలు పెంచుతున్నాడు.
గంగమ్మకు చెందిన ఓ నాటు కోడి మంగళవారం రాత్రి రాకేశ్‌కు చెందిన గడ్డివాములోకి చేరి గేదెలు గడ్డి తినకుండా చేసింది. దీంతో రాకేశ్ కర్రతో కొట్టడంతో ఆ కోడి కాళ్లు విరిగాయి. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేశ్‌పై ఫిర్యాదు చేసేందుకు గంగమ్మ అదే రోజు రాత్రి నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. గాయపడిన తన కోడిని సీఐ రాజశేఖర్‌కు చూపించి రాకేశ్‌పై చర్యలు తీసుకోమని కోరింది. నష్టపరిహారం ఇప్పిస్తామని సీఐ చెప్పినా అంగీకరించని గంగమ్మ కేసు పెట్టాలని పట్టుబట్టింది. దీంతో రాకేశ్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడతామని నచ్చజెప్పిన పోలీసులు గంగమ్మను పంపించారు. గంగమ్మ చేసిన ఫిర్యాదుపై ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు కాలేదు. కానీ, ఆ పోలీసులతో మాట్లాడుతుండగా తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరలైంది.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News