ED Rides: హవాలా వ్యాపారులపై ఈడీ దాడుల కలకలం..
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:14 PM
హైదరాబాద్‍లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ED Rides in Hyderabad: హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, గతంలోనూ దేశవ్యాప్తంగా హవాలా వ్యాపారులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, బెంగాల్, కోల్‌కతాలోనూ దాడులు చేశారు. తనిఖీల్లో భారీ మొత్తంలో హవాలా డబ్బుని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, కోటి, బషీరాబాగ్ ప్రాంతాల్లో హవాలా సొమ్ము పెద్ద మెుత్తంలో పట్టుబడ్డింది. అయితే హైదరాబాద్‌లో హవాలా నడిపిస్తున్న వ్యక్తులే టార్గెట్‌గా ఈ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నగరంలో హవాలా కేసులో పట్టుబడిని నిందితుల లిస్ట్ ఆధారంగా ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.
Also Read:
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Pawan on Pahalgam Attack: అలా అడిగి మరీ చంపారంటే ఎంతటి దారుణం.. ఉగ్రదాడిపై పవన్
Crime News: సింగపూర్ వెళ్తున్న విమానంలో భారతీయుడి అరెస్ట్.. ఎందుకంటే..