BJP: ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ చేయించాలి: డీకే అరుణ
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:57 AM
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.

నల్లగొండ టౌన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో బీజేపీ నాయకులందరూ బాధితులేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జూన్ 25వ తేదీ దేశ చరిత్రలో చీకటి రోజు అని, ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు.