DGP Jitender: సమష్టి కృషితోనే డ్రగ్స్ కట్టడి: డీజీపీ జితేందర్
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:24 AM
పోలీస్‌తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజల సమష్టి కృషితోనే డ్రగ్స్, ఇతర నిషేధిత మత్తు పదార్థాల్ని కట్టడి చేయగలమని డీజీపీ జితేందర్ అన్నారు.

హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజల సమష్టి కృషితోనే డ్రగ్స్, ఇతర నిషేధిత మత్తు పదార్థాల్ని కట్టడి చేయగలమని డీజీపీ జితేందర్ అన్నారు. పాఠశాల స్థాయి నుంచే యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అవగాహన వారోత్సవాలను డీజీపీ జితేందర్ శనివారం ప్రారంభించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే చెడు ప్రభావాల గురించి ప్రతి ఒక్కరూ పది మందికి తెలపాలన్నారు.
నక్సలైట్ల ఆశయాలను బంధించగలరా?
అమిత్‌షాకు జస్టిస్ చంద్రకుమార్ బహిరంగ లేఖ
హైదరాబాద్ సిటీ, జూన్21(ఆంధ్రజ్యోతి): ‘అమిత్‌షా గారు...! మీరు నక్సలైట్ల శవాలను చూసి సంతోషిస్తున్నారా? లేక గర్వపడుతున్నారా?’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రికి ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ బహిరంగ లేఖ రాశారు. నక్సలైట్ల భావాలను చూసి భయపడుతున్నారా? మావోయిస్టుల మృతదేహాలను మాయం చేయగలరేమోగానీ వారి భావాల ప్రకంపనలను ఆపగలరా? అంటూ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News