Bhatti Vikramarka Backs Jyotiba Phule: పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ఓకే
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:52 AM
అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ

బీసీ సంఘాలతో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతోపాటు బడ్జెట్‌లో నిధులు పెంచి సరైన సమయంలో బీసీ సబ్ ప్లాన్ తెస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జ్యోతిబాపూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పనతోపాటు నిధుల కేటాయింపులో న్యాయం చేస్తామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తమ ప్రభుత్వం బీసీల విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. పూలే భవన్‌లో భట్టితో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు ప్రతియేటా 20వేల కోట్లు కేటాయించాలని జాజుల కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News