Share News

HYDRA: హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:08 PM

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా మళ్లీ యాక్షన్‌లోకి దిగింది. మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. అంతేకాకుండా, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తోంది. హైడ్రా అధికారుల పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

HYDRA: హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు..
HYDRA

హైదరాబాద్ : అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మియాపూర్ వరల్డ్ వన్ స్కూల్ వెనుక ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. షెడ్లను జెసిబిల సహాయంతో కూల్చివేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గతంలో సంబంధిత వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.


ఈ క్రమంలోనే తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని సర్వే నెంబర్ 213, 214 ,215 ,216 లో స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ లతో పాటు సుమారు 7, 8 కాలనీ స్థానికులు హైడ్రా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. రహదారి కబ్జా చేసి చుట్టూ కొంతమంది వ్యక్తులు ప్రహరీ గోడ నిర్మించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు.

అక్రమ కట్టడాలపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న నాధుడే లేడని.. కానీ, ముత్యాలమ్మ అనే మహిళ ఒంటరి పోరాటం చేస్తూ హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రాధికారులు స్పందించి అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేయడం సంతోషంగా ఉందన్నారు. సమస్యను పరిష్కరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి బాధిత కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Also Read:

Jagdeep Dhankar: న్యాయవ్యవస్థపై దన్‌ఖడ్ వ్యాఖ్యల దుమారం.. విపక్షాలు ఆక్షేపణ, తిప్పికొట్టిన బీజేపీ

Prabodh Saxena: అధికారులకు విందు, బిల్లు ప్రభుత్వానికి.. సీఎస్ నిర్వాకంపై వివాదం

BJP: తేల్చి చెప్పేశారుగా.. అధికారంలో భాగస్వామ్యం కోరం..

Updated Date - Apr 19 , 2025 | 12:14 PM