Share News

‘లక్ష డప్పులు’ వాయిదా: మందకృష్ణ మాదిగ

ABN , Publish Date - Feb 22 , 2025 | 03:46 AM

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

‘లక్ష డప్పులు’ వాయిదా: మందకృష్ణ మాదిగ

బర్కత్‌పుర, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఆనాడు కేసీఆర్‌ హయాంలో కడియం శ్రీహరి, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో దామోదర రాజనర్సింహ మాదిగలకు ద్రోహం చేశారని ఆరోపించారు.


ఫిబ్రవరి 7న జరగాల్సిన ‘లక్ష డప్పులు, వేల గొంతుల సాంస్కృతిక ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడిందని, ఈ నెల 24న సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మహ్మద్‌ షమీ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించారని, ఎస్సీల్లో 58 ఉప కులాలు తమకు జరిగిన అన్యాయాలపై నివేదిక సమర్పించాలని పిలుపునిచ్చారు.

Updated Date - Feb 22 , 2025 | 03:46 AM