Manda Krishna: ఆగస్టు 13న హైదరాబాద్‌లో.. దివ్యాంగుల మహాగర్జన
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:51 AM
తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

మంద కృష్ణ మాదిగ
పంజాగుట్ట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఏపీలో నెలకు రూ.15 వేలు ఇస్తున్నారని, ఇక్కడ ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఆగస్టు 13న చలో హైదరాబాద్ దివ్యాంగుల మహా గర్జనకు సంబంధించిన సన్నాహక సదస్సుకు మద్దతుగా తెలంగాణ మస్క్యూలర్ డిస్ట్రోఫీ అసోసియేషన్, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15 వేల పెంపుపై ‘మా గోస పేరు’తో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ రూ.4వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రూ.15 వేల పెన్షన్‌ను మంజూరు చేసి హామీ ఇచ్చిన రోజు నుంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్టాప్ బోర్డును మార్చడం.. బ్రేక్ వేయడంలో ఆలస్యం
చార్మినార్ రైలు పట్టాలు తప్పడానికి కారణం
న్యూఢిల్లీ, జూలై 11: బ్రేక్ వేయడంలో ఆలస్యం, అత్యవసర బ్రేక్‌ను వేయకపోవడం, స్టాప్ బోర్డును ప్లాట్‌ఫామ్ డెడ్ ఎండ్‌కు మార్చడం వంటివి గత ఏడాది హైదరాబాద్ స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణమైనట్టు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది. 2024 జనవరి 10న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ స్టేషన్‌లో ఐదో నంబరు ప్లాట్‌ఫాంపై నేరుగా వెళ్లి డెడ్ ఎండ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఆర్‌ఎస్ సౌత్ సెంట్రల్ సర్కిల్ దర్యాప్తు చేపట్టింది. లోకోపైలట్ ఆటోమెటిక్ బ్రేక్‌ను ఆలస్యంగా వేశారని, అసిస్టెంట్ లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంలో విఫలమైనట్టు దర్యాప్తు నివేదికలో పేర్కొంది. స్టాప్ బోర్డును స్టేషన్ అడ్మినిస్ర్టేషన్ డెడ్ ఎండ్‌కు మార్చడం కూడా ప్రమాదానికి దారితీసినట్టు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News