Damodara Rajanarsimha: ఆస్పత్రుల్లో తాగునీటికి ఇబ్బంది రావొద్దు
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:59 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

ఫ్యాన్లు, ఏసీలు ఏర్పాటు చేసుకోవాలి: దామోదర
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, వారి అటెండెంట్లకు, సిబ్బందికి తాగునీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆస్పత్రుల ఆవరణల్లో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాగునీటి సౌకర్యం, ఇతర అంశాలపై మంత్రి శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐసీయూలు, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో పవర్ కేబుళ్లను సరిచూసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల లోపల, బయట గుట్కా నమలడం, పొగ తాగడం, మద్యపానం సేవించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఆదేశించారు. వడ దెబ్బ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సుచించారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News