Share News

Cyber Fraud: సైబర్‌ ఆర్థిక మోసాల ముఠా గుట్టు రట్టు

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:35 AM

అమాయకులను మభ్యపెట్టి సైబర్‌ ఆర్థిక మోసాలకు పాల్పడిన ముఠా గుట్టు రట్టయింది. మంచిర్యాల జిల్లా జన్నారం

Cyber Fraud: సైబర్‌ ఆర్థిక మోసాల ముఠా గుట్టు రట్టు

  • మంచిర్యాల జిల్లా జన్నారంలో నలుగురి అరెస్టు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అమాయకులను మభ్యపెట్టి సైబర్‌ ఆర్థిక మోసాలకు పాల్పడిన ముఠా గుట్టు రట్టయింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో నిర్వహిస్తున్న అక్రమ సిమ్‌ బాక్స్‌ సెట్‌పను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్‌సబీ) టెలీ కమ్యూనికేషన్‌ విభాగం(డాట్‌), రామగుండం పోలీసులు సంయుక్తంగా చేధించాయి. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఈ ఆపరేషన్‌లో 5 సిమ్‌ బాక్స్‌ పరికరాలు, 230కి పైగా సిమ్‌ కార్డులు, ల్యాప్‌టాప్‌, ఇతర హార్డ్‌వేర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పొలవల్సుల సాయి కృష్ణ (జాక్‌) పరారీలో ఉన్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న సిమ్‌బాక్స్‌లు కంబోడియా, మయన్మార్‌ దేశాల నుంచి రిమోట్‌గా నియంత్రిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఓబీసీల్లో మరో 40 కులాలను చేర్చాలి: నిరంజన్‌

కేంద్ర ఓబీసీ జాబితాలో మరో 40 కులాలను చేర్చాలని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్‌కు ఆయన లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాను 2016లో ప్రకటించారు. అయితే అప్పటికే రాష్ట్ర బీసీ జాబితాలో 112 కులాలుండగా, కేంద్రం కేవలం 90 కులాలతోనే జాబితా విడుదల చేసింది. ఇటు రాష్ట్ర జాబితాలో అనాథలను, మరో 17 కులాలనూ చేర్చడంతో బీసీ జాబితాలో కులాల సంఖ్య 130కి పెరిగింది. దీంతో కేంద్ర జాబితాలో చేర్చాల్సిన కులాల సంఖ్య 40కి చేరింది. ఇప్పటికైనా సదరు 40 కులాలను వెంటనే ఓబీసీ జాబితాలో చేర్చాలి’ అని విన్నవించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:35 AM